FbTelugu

ప్రేమికుల పెళ్లి… శోభనం రాత్రి విషాహారం!

పాట్నా: బిహార్ గోపాల్ గంజ్ నగరంలోని మిర్జ్ గంజ్ లో ప్రేమికుల జంట శోభనం నాడే విషాహారం తీసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. శోభనం జరిగిన రాత్రి తెల్లవారు జమున కుటుంబ సభ్యులు వెళ్లేసరికి ఇద్దరూ అపస్మారక స్థితిలో పడి ఉన్నారు.
వెంటనే ఇద్దరి అంబూలెన్స్ లో హాస్పిటల్ కు తరలించగా ప్రాణాపాయం తప్పింది. స్పృహలోకి వస్తే కాని ఏం జరిగిందో చెప్పలేమని పోలీసులు తెలిపారు. ఈ ఘటన కు సంభందించి వివరాలు ఇలా ఉన్నాయి. జంషెడ్ పూర్ గ్రామానికి చెందిన శాంతి దేవీ (28), గోపాల్ గంజ్ నగరం మిర్జ్ గంజ్ కు చెందిన ముకేశ్ (30) ఇద్దరూ కొన్నేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు.

పెద్దలను ఒప్పించి ఇరువురూ శనివారం నాడు ఒక గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఆదివారం నాడు నూతన దంపతులను మిర్జ్ గంజ్ కు తీసుకువెళ్లారు. అదే రోజు శోభనం కోసం ఏర్పాట్లు చేసి రాత్రి గదిలోకి పంపించారు. సోమవారం తెల్లారినా ఇద్దరూ బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. ఇద్దరూ అపస్మారక స్థితిలో కన్పించారు. పక్కనే చికెన్ కూరలో విషం కలిపి ఉంది. అపస్మారక స్థితిలో ఉన్న ఇద్దరిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స చేస్తున్నారు. ప్రేమించుకుని పెళ్లి చేసుకుని, ఇలా ఆత్మహత్యాయత్నానికి ఎందుకు పాల్పడ్డారనేది కుటుంబ సభ్యులు కూడా చెప్పలేకపోతున్నారు. స్పృహలోకి వస్తే కాని ఏమి చెప్పలేమని అంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.