FbTelugu

కరోనా బాధితుల పరిహారం కోసం వెబ్ ఫోర్టల్

న్యూఢిల్లీ: కరోనా వైరస్ బారిన పడి చనిపోయిన వారిని ఆదుకునేందుకు అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇవాళ ఆయన మరణించినవారు పరిహారం కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా వెబ్ ఫోర్టల్ ను ప్రారంభించారు.
కరోనా తో చనిపోయిన వారి కుటుంబ సభ్యులు పరిహారం కోసం ఫోర్టల్ లో దరఖాస్తు సమర్పించాలని సిఎం అరవింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు.

ఆన్ లైన్ లో దరఖాస్తు సమర్పించిన తరువాత అధికారులు వారి ఇళ్ల వద్దకే వెళ్లి విచారణ జరిపి సిఫారసు చేస్తారని ఆయన తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులను కలిసిన సందర్భంలో అధికారులు వారితో గౌరవంగా ఉండాలని, కుటుంబంలో ఒకరిని కోల్పోయిన బాధలో ఉన్నవారిని వేధింపులకు గురి చేయవద్దని సిఎం సూచించారు. ఎవరి నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా పనిచేయాలని అధికారులకు స్పష్టం చేశారు. కుటుంబంలో ఒకరు చనిపోతే వన్ టైమ్ సెటిల్ మెంట్ కింద రూ.50వేలు అందచేస్తామన్నారు. పిల్లలు అనాథలు గా మారితే నెల రూ.2500 చొప్పున పెన్షన్ మంజూరు చేస్తామని కేజ్రీవాల్ ప్రకటించారు. పరిహారంపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తమ వద్ద డబ్బులు లేవని సుప్రీంకోర్టులో వాదిస్తుండగా, అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఏకంగా సాయం చేసేందుకు రంగంలోకి దిగడం ఆహ్వానించదగ్గ పరిణామం.

You might also like

Leave A Reply

Your email address will not be published.