FbTelugu

టీచర్లకు వెబ్ కౌన్సెలింగ్ బదిలీలు: మంత్రి సురేష్

అమరావతి: దీర్ఘ కాలంగా ఉన్న టీచర్లకు బదిల్లీల్లో ప్రాధాన్యత ఇస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. హెడ్‌ మాస్టర్లకు 5 ఏళ్లు, టీచర్లకు 8 ఏళ్లు ఉంటే బదిలీ చేస్తామని ఆయన వెల్లడించారు.

రెండేళ్ళు పూర్తైనవారికి రిక్వెస్ట్ ట్రాన్స్‌ఫర్‌కు అవకాశం ఇస్తామని సురేష్‌ పేర్కొన్నారు. మరింత పారదర్శకత కోసమే వెబ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. హెచ్‌ఆర్‌ఏ ఆధారంగా 4 కేటగిరీలుగా విభజించామని, 5 రోజుల పాటు వెబ్‌ ఆప్షన్‌ అప్‌డేట్‌ చేసుకోవచ్చని మంత్రి సూచించారు. బ్లాక్ చేస్తే తప్ప మారుమూల ప్రాంతాలకు ఎవరూ వెళ్లరని, డిసెంబర్‌ 16 నుంచి 6 రోజులు జాబితా ప్రకటిస్తామని సురేష్‌ తెలిపారు. కొవిడ్‌-19 నేపథ్యంలో ఆన్‌లైన్‌లోనే ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు స్వీకరించి వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా బదిలీలు చేపట్టనున్నామని మంత్రి వెల్లడించారు. 40 శాతం వైకల్యం ఉంటే దివ్యాంగుల కింద పరిగణించి బదిలీల్లో ప్రాధాన్యం ఇస్తారన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన జీఓ 29 ప్రకారమే ఈసారి రేషనలైజేషన్‌ ప్రక్రియ అమలు చేయనున్నట్లు ఆయన చెప్పారు. అయితే, గత ప్రభుత్వం ఆదర్శ ప్రాథమిక పాఠశాలలకు కేటాయించిన పోస్టులను రద్దు చేస్తున్నట్లు మంత్రి సురేష్ ప్రకటించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.