FbTelugu

వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం

హైదరాబాద్: వాయువ్య బంగాళాఖాతంలో 7.6 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం వ్యాపించి ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

దీని ప్రభావంతో తెలంగాణలో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర వెల్లడించింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాల ప్రభావంతో చెదురు మొదురు వర్షాలు పడుతున్నాయి. ఏపీలోనూ వీటి ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉన్నట్టు తెలిపింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.