FbTelugu

రమేష్ హాస్పిటల్ పై కఠిన చర్యలు తీసుకుంటాం

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని హెచ్చరిక

విజయవాడ: స్వర్ణ ప్యాలెస్ లో ప్రమాదం జరగడం దురదృష్టకరమని, మొత్తం 31మంది పాజిటివ్ రోగులు ఈ హోటల్ లో చికిత్స పొందుతున్నారని డిప్యూటీ సిఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు.

ఈ ప్రమాదం జరిగిన వెంటనే సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి మృతుల కుటుంబాలకు రూ.50లక్షలు పరిహారం ప్రకటించారన్నారు. మొత్తం ఈ ఘటనలో 10మంది మృతి చెoదగా,  మిగిలిన 21మంది క్షేమంగా ఉన్నారని ఆయన వివరించారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన తరువాత ఆళ్ల నాని మీడియాతో మాట్లాడారు. ప్రమాదం ఆదివారం తెల్లవారు జామున 4-5గంటలు మధ్యలో జరిగిందన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని నివారణ చర్యలు చేపట్టారన్నారు. సీఎం అదేశాలు మేరకు విచారణ కమిటీని నియమించామన్నారు. ఆరోగ్య శ్రీ సీఈఓ డా.మల్లిఖార్జున, డైరెక్టర్ అఫ్ హెల్త్ డా.అరుణకుమారి తో కమిటీ ఏర్పాటు చేశామన్నారు.

48గంటల్లో నివేదిక రాగానే ఈ ఘటనకు బాద్యులపై కఠిన చర్యలు తీసుకుంటుంది. ఈ ప్రమాదంపై నివేదిక రాగానే బాధ్యులను వదిలే ప్రసక్తి లేదని, కఠినంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అదేశిoచారన్నారు. కరోనా నివారణకు వైద్య సదుపాయం అందిస్తామని ముందుకు వచ్చిన ప్రెవేట్ హాస్పిటల్ కు కోవిడ్ సెంటర్ నిర్వహణ కు అనుమతులు ఇచ్చామన్నారు. హోటల్ స్వర్ణ ప్యాలెస్ పై విజయవాడ గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ లో రెవిన్యూ అధికారులు కేసు నమోదు చేశారన్నారు. హాస్పిటల్ పై 304, 308 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగిందని ఆళ్ల నాని వివరించారు.

ఈ ఏడాది మే నెలలో రమేష్ హాస్పిటల్ యాజమాన్యం ముందుకు వచ్చి కరోనా బాధితులకు వైద్యం అందిస్తామని చేప్పడంతో 40 బెడ్స్ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వడం జరిగింది. కరోనా రోగుల విషయంలో రమేష్ హాస్పిటల్ యాజమాన్యం తప్పుడు నివేదిక ఇచ్చినట్టు ప్రాధమిక విచారణ లో తేలిందన్నారు. ఈ ఘటనలో రమేష్ హాస్పిటల్ యాజమాన్యం నిర్లక్ష్యం ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ హాస్పిటల్స్ నడుపుతున్న కోవిడ్ సెంటర్ల పై ప్రత్యేకంగా దృష్టి పెట్టామన్నారు.

స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటనలో మృతి చెందిన వారు…

1. రమేష్, విజయవాడ

2. బపూర్ణ చంద్ర రావు, మొవ్వ

3. డోక్కు శివ బ్రహ్మయ్య, మచిలీపట్నం

4. మజ్జి గోపి, మచిలీపట్నం

5. అబ్రహం, జగ్గయ్యపేట

6. రాజకుమారి, జగ్గయ్యపేట

7. సుంకర బాబు రావు, సింగ్ నగర్ రిటైర్డ్ ఎస్సై

8. వెంకట లక్ష్మి సువర్చలా దేవి, కందుకూరు

9. సువర్ణ లత పొన్నూరు, నిడుబ్రోలు.

You might also like