FbTelugu

తిరుమలపై అనధికారిక దుకాణాల తొలగిస్తాం: టిటిడి

తిరుమల: కొండ పై అనధికారిక దుకాణాలను వారం రోజుల్లో తొలగిస్తామని, భక్తులకు ఇబ్బంది లేకుండా తీర్చిదిద్దుతామని టిటిడి చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి తెలిపారు. ఇవాళ జరిగిన టిటిడి పాలక మండలి లో పలు నిర్ణయాలు తీసుకున్నామన్నారు.
తిరుమలను గ్రీన్ జోన్ గా ప్రకటిస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన వంద ఎలక్ట్రిక్ బస్సును కొండపైకి నడుపుతామని ఆయన తెలిపారు.

ఈ ఏడాది సెప్టెంబర్ లోపు తాత్కాలిక ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడానికి కమిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. రాష్ట్రంలో 13 ప్రాంతాల్లో టిటిడి కల్యాణ మండపాలను నిర్మిస్తున్నామన్నారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా వచ్చిన నిధులను ఆలయాల నిర్మాణానికి వెచ్చిస్తామని చెప్పారు. త్వరలోనే ముంబయి, వారణాసిలో కూడా ఆలయాల నిర్మాణం చేపడ్తామన్నారు. గోవిందుడికి గోవు ఆధారిత వ్యవసాయం తో పండించిన బియ్యంతోనే నైవేద్యం సమర్పిస్తున్నామని సుబ్బారెడ్డి వివరించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.