FbTelugu

విశాఖ స్టీల్స్ ను రక్షిస్తాం: సోము వీర్రాజు

గుంటూరు: విశాఖ స్టీల్ ప్లాంట్ ను రక్షిస్తామని, ఇది బీజేపీ వైఖరని అని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ ఉంటుంది, ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు.

ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ. ఇంత వరకు స్టీల్ ప్లాంట్ పై కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి ప్రకటన చేయలేదన్నారు. శుక్రవారం పలువురు ముస్లిం నాయకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా సోమువీర్రాజు మాట్లాడుతూ దేశంలో ఉన్నవారంతా వందేమాతరం పాడాల్సిందే అని స్పష్టం చేశారు. తమిళనాడుకు చెందిన ఏపీజే అబ్దుల్ కలాంని రాష్ట్రపతి చేసింది బీజేపీనే అని, ముస్లిం మహిళల రక్షణ కోసం త్రిపుల్ తలాక్ చట్టాన్ని తెచ్చామన్నారు. దేశంలో మైనార్టీల అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని, కాంగ్రెస్ మాత్రం ఓటు బ్యాంకుగా చూస్తోందని సోము వీర్రాజు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.