FbTelugu

ఆ బిల్లును పార్లమెంటులో వ్యతిరేకిస్తాం: కేసీఆర్

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలని చూస్తున్న కొత్త విద్యుత్ చట్టం ఫెడరల్ వ్యవస్థకు విరుద్దంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కొత్త విద్యుత్ చట్టంపై కేసీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర నిర్ణయాన్ని తప్పుబడుతూ.. మోదీకి లేఖ కూడా రాశారు. ఈ బిల్లును పార్లమెంటులో అడ్డుకుంటామని హెచ్చరించారు.

కొత్త విద్యుత్ చట్టంతో తెలంగాణలో రైతులకు ఇస్తున్న 24 గంటల ఉచిత కరెంటుకు విఘాతం ఏర్పడుతుందని అన్నారు. ఇందుకోసం బిల్లును తప్పకుండా అడ్డుకుంటామని, అది మా హక్కని అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.