FbTelugu

ట్రంప్ ఛానల్ పై అప్పుడే నిర్ణయం: యూ ట్యూబ్

వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఛానల్ నిషేధం ఎత్తివేత పై ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోవడం లేదని యూ ట్యూబ్ పరోక్షంగా వెల్లడించింది. దేశంలో హింస చెలరేగే అవకాశాలు తగ్గాయా లేదా అనేది నిర్థారించుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న హెచ్చరికలు పరిశీలిస్తున్నామని తెలిపింది.

యూఎస్ కేపిటల్ భవనంపై ఇంకా హింస చెలరేగే అవకాశాలు ఉన్నాయని పోలీసులు హెచ్చరించిన నేపథ్యంలో ఛానల్ పై నిషేధం ఎత్తివేయడం లేదని యూ ట్యూబ్ సీఈఓ సుసాన్ వోజ్కీకి వెల్లడించారు. ఇప్పటికీ హింస జరుగుతుందని తాము భావిస్తున్నామని పేర్కొన్నారు. నూతన అధ్యక్షుడు జోసెఫ్ ఆర్.బైడెన్ ఎన్నికను వ్యతిరేకిస్తూ ట్రంప్ మద్దతుదారులు యూఎస్ కేపిటల్ భవనం ముందు అల్లర్లకు దిగి కాల్పుల వరకు తీసుకువెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశ చరిత్రలోనే మాయని మచ్చగా మిగిలింది. ఈ ఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో పాటు ట్రంప్ నకు చెందిన ఫేస్ బుక్, యూ ట్యూబ్, ట్విట్టర్ ఖాతాలను శాశ్వతంగా నిషేధించిన విషయం తెలిసిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.