FbTelugu

రిటైర్ అయినా… సరసాలపై విచారిస్తాం

స్పష్టం చేసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: జూనియర్ న్యాయాధికారిణితో సరసాలకు పాల్పడిన రిటైర్డు జడ్జీని వదిలే ప్రసక్తి లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బాధితురాలు పిటీషన్ ఉపసంహరించుకున్నా అంతర్గత విచారణ నుంచి తప్పుంచుకోలేడని సుప్రీంకోర్టు పేర్కొంది.
తనను జిల్లా న్యాయమూర్తి (ప్రస్తుతం రిటైర్డు) లైంగికంగా వేధించారంటూ జూనియర్ న్యాయధికారిణి మధ్యప్రదేశ్ హైకోర్టులో ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి అంతర్గత విచారణకు ఆదేశించారు.

ఈ విషయం తెలుసుకున్న జిల్లా జడ్జీ, హైకోర్టు న్యాయమూర్తి గా పదోన్నతి రాకుండా ఉండేందుకు ఆమె దురుద్దేశంతోనే ఫిర్యాదు చేశారంటూ ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు. మంగళవారం నాడు సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బొబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. జిల్లా న్యాయమూర్తి జూనియర్ న్యాయాధికారిణి పట్ల సరసాలకు పాల్పడడం ఎంతమాత్రం తగదని అన్నారు. ఆమెకు అసహ్యకరమై, వేధింపులకు గురి చేసే విధంగా మెసేజీలు పంపించారు. జూనియర్ అధికారితో సరసాలకు పాల్పడడం ఏంటని ప్రశ్నించారు. మధ్యప్రదేశ్ హైకోర్టు నిర్ణయం మేరకు ఆయన అంతర్గత విచారణ ను ఎదుర్కోవాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.