FbTelugu

కరోనా పరీక్షల సంఖ్య పెంచుతాం: మంత్రి ఆళ్ల నాని

అమరావతి: మందులు, ఆక్సిజన్ కొరత దేశంలో ఉందని, ఆంధ్రాలోనూ ఇబ్బందులు ఉన్నప్పటికీ దాన్ని ఎదుర్కొనేందుకు కార్యాచరణ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని డిప్యూటీ సిఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు.

కొద్ది సేపటి క్రితమే కోవిడ్ పై మంత్రివర్గ ఉపసంఘం భేటీ ముగిసిందని ఆయన అన్నారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఏం చర్యలు తీసుకోవాలి, వ్యాప్తి నిరోధానికి చేపట్టాల్సిన చర్యలు, ఆస్పత్రుల్లో పడకల సంఖ్య పెంపు, కోవిడ్ కేర్ కేంద్రాలను పెంచటం, రెమిడెసివిర్ ఇంజెక్షన్, ఆక్సిజన్ కొరత లాంటి అన్ని అంశాలు చర్చించామని ఆళ్ల నాని మీడియాకు వివరించారు. కోవిడ్ నియంత్రణ కోసం, ప్రజలకు సందేహాలు నివృత్తి, ఫిర్యాదుల స్వీకరణ కోసం 104 కాల్ సెంటర్ బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రైవేటు ఆస్పత్రులు ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు మాత్రమే వసూలు చేయాలి, అలా కాకపోతే కఠిన చర్యలు తీసుకోడానికి వెనుకాడబోమని ఆళ్ల నాని హెచ్చరించారు.

ప్రజలు మాస్కు లు, భౌతిక దూరం లాంటి జాగ్రత్తలు తీసుకుని కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి కృషి చేయాలన్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా వేగంగా పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 360 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం అవుతోంది.. ప్రభుత్వ ఆస్పత్రులకు ఇబ్బంది లేదన్నారు. ఆక్సిజన్ ప్లాంట్ పెట్టేందుకు కేంద్రం సహకారం అందిస్తామని తెలిపిందన్నారు. ఏపీలో49 లక్షల మందికి వ్యాక్సినేషన్ వేశామని, కేంద్రం సరఫరా చేసినంత మేర వ్యాక్సినేషన్ వేయగలుగుతున్నామన్నారు. 18 ఏళ్లు పైబడిన వ్యక్తులకు వ్యాక్సినేషన్ వేసే విషయంలో ఇంకా స్పష్టత లేదు.. సీఎం దగ్గర చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కరోనా పరీక్షల సామర్ధ్యం పెంచుతామని, ఫలితాలు ఆలస్యం అవుతున్నాయని ఫిర్యాదులు వస్తుండడంతో సమీక్షించాలని నిర్ణయించామని ఆళ్ల నాని వివరించారు.

ap ministers

You might also like

Leave A Reply

Your email address will not be published.