FbTelugu

పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ చేస్తాం: బండి సంజయ్

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మేయర్ సీటు లో కూర్చోగానే పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన ప్రకటన చేశారు. పాతబస్తీలో ఓట్లు వేసేది రోహింగ్యాలు, పాకిస్థాన్ వాసులు అని ఆయన ఆరోపించారు.
టీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేసిన ప్రసంగంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తీవ్రంగా బదులిచ్చారు. మేము మేయర్ గా గెలిచిన తరువాత బిడ్డా… సర్జికల్ స్ట్రైక్ చేస్తామని ఆయన అన్నారు. మహానగరంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేవని, వరదలొస్తే పట్టించునే ప్రభుత్వం లేదన్నారు. రోజూ నిమ్మలంగా పోదామంటే రోడ్లు సక్కగా లేవన్నారు. నగరంలో వరద నీళ్ల సంగతేంది అని మేం అడుగుతుంటే.. మీరు ముచ్చట నీళ్ల బిల్లు మాఫీ చేస్తామని ప్రకటించారన్నారు. ఇన్నేండ్ల నుంచి లేంది ఎన్నికల ముందు గుర్తొచ్చిందా ఈ నీళ్ల ముచ్చట అని ఆయన ప్రశ్నించారు.

దేశంలో చాలాచోట్ల కనిపించవుగానీ, మన హైదరాబాద్‌లో గుజరాతీ గల్లీ ఉంటది. పార్సి గుట్ట ఉంటది, సిందీ కాలనీ ఉంటది, అరబ్ గల్లీ ఉంటది. ఒక అందమైన పూలబొకే లాంటి నగరం హైదరాబద్ అని సీఎం అంటారన్నారు. వీటన్నింటితో పాటు ప్రతి గల్లీలో టీఆర్‌‌ఎస్ అరాచకం ఉంటుంది. పూలబొకే లాంటి నగరాన్ని కరోనాతో కాటు వేయించారు. వరదల్లో ముంచేశారు. అబద్దాలతో ఆడించారు. దొరికినకాడికి దోచుకొని… పూలబొకే లాంటి నగరాన్ని నలిపేశారని బండి సంజయ్ ధ్వజమెత్తారు. లక్ష ఎలక్ట్రిక్ వెహికిల్స్ రోడ్డు మీదకు తీసుకొస్త…పొల్యూషన్ పోగొడ్త అని పోజులు కొట్టారు అన్నారు. లక్ష బెడ్రూమ్‌లు అన్నడు పోయిన ఎలక్షన్లకు.. లక్షణంగా మోసం చేయడానికి మళ్లీ లక్ష మాటలు చెప్పిపోయిండు ఇయ్యాళ అని సంజయ్ ఆరోపించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.