హైదరాబాద్: పీఆర్సీ నివేదికపై ఉద్యోగులు భగ్గుమంటున్నారు. 7.5 శాతం ఫిట్ మెంట్ ఇస్తూ సిఫారసు చేయడాన్ని ఉద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఉద్యోగులు తమ సంఘాల నాయకులకు ఫోన్ చేసి భగ్గుమంటున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న ఫోన్ కాల్స్ ను తట్టుకోలేని టీఎన్జీఓఎస్ నాయకులు బయటకు వచ్చారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చిస్తామని టీఎన్జీఓఎస్ అధ్యక్షుడు, జేఏసీ ఛైర్మన్ రాజేందర్ తెలిపారు. 43 శాతానికి తగ్గకుండా పీఆర్సీ ఇవ్వాలని ప్రధాన కార్యదర్శిని కోరామన్నారు. దీనిపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాలని, కమిటీ నివేదికను చెత్త బుట్ట వేయాలని ఆయన కోరారు. కేసీఆర్, మంత్రులను కలిసి ఆమోదయోగ్యమైన పీఆర్సీని సాధిస్తామని, కొట్లాడి సాధించిన తెలంగాణలో ఉద్యోగులకు అన్యాయం జరిగిందన్నారు. సీఎం దగ్గర మా తలుపులు మూసుకుపోలేదని, తేగేదాక లాగమని రాజేందర్ స్పష్టం చేశారు.