FbTelugu

ఈ కామర్స్ కు మూకుతాడు వేస్తాం: పీయుష్

న్యూఢిల్లీ: దేశంలో ఈ కామర్స్ సంస్థలు చట్టాలను ఉల్లంఘిస్తున్నామని, తమకు తాము స్వయంప్రతిపత్తి సంస్థలుగా ఊహించుకుంటున్నామని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయుష్ గోయల్ మండిపడ్డారు.
ఫ్లాష్ సేల్ నిర్వహించడానికి వీలు లేకుండా నిబంధనలు సవరిస్తున్నామని, వినియోగదారుల హక్కుల సంరక్షణ చట్టానికి సవరణలు సూచించినట్లు ఆయన వివరించారు.

జూలై 6వ తేదీలోపు దీని సూచనలు, సలహాలు తెలిపే వీలుంటుంది. ఈ ముసాయిదా ప్రకారం ఈ కామర్స్ సంస్థలు చీఫ్ కంప్లయిన్స్ ఆపీసర్, రెసిడెంట్ గ్రీవెన్స్ అధికారి ని నియమించాలి. చట్టబద్ద ఏజెన్సీలతో సమన్వయం కోసం 24 గంటలూ అందుబాటులో ఉండే విధంగా ప్రత్యేక అధికారి, నెంబర్ ఉండాలి. ఇలా చట్రంలో బిగించేందుకు ప్రతిపాదించిన నిబంధనలను ఈ కామర్స్ సంస్థలు వ్యతిరేకిస్తున్నాయన్నారు. తమకున్న భారీ సంపద, మార్కెట్ లో వాటాను చూసి చూసుకుని చిన్న దుకాణాలను దెబ్బకొడుతున్నాయని పీయుష్ వ్యాఖ్యానించారు. ఈ కామర్స్ సంస్థలతో పలుమార్లు చర్చించానని, ముఖ్యమంత్రి అమెరికన్ సంస్థలు అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) విచారణకు కూడా ఫ్లిప్ కార్ట్, అమెజాన్, వాల్ మార్ట్ వంటి సంస్థలు నిరాకరిస్తున్నాయని పీయుష్ గోయల్ అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.