అమరావతి: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని మంత్రులు పేర్ని నాని, కె.కన్నబాబు, పినిపే విశ్వరూప్ స్పష్టం చేశారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన పదవీకాలం ముగిసేలోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనే దుర్భుద్దితో ఉన్నారని వారు ఆరోపించారు. కరోనా వైరస్ సమస్య తీవ్రంగా సమయంలో ఎన్నికలు నిర్వహించడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడమేనన్నారు. ఎన్నికలు నిర్వహిస్తే ఒక్క గ్రామంలోనైనా గెలిచే దమ్ము టీడీపీకి ఉందా అని వారు ప్రశ్నించారు. హైకోర్టు తీర్పును కచ్చితంగా సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని మంత్రులు ప్రకటించారు.