FbTelugu

అధికారం ఇస్తే రోహింగ్యాలను తరిమికొడ్తాం: అమిత్ షా

హైదరాబాద్: ఒక్కసారి అధికారం ఇవ్వండి హైదరాబాద్ లో ఉన్న రోహింగ్యాలను ఎలా తరిమికొడతామో చుడండని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు.
చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంలో అమిత్ షా ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత సికింద్రాబాద్ పరిధిలోని సీతాఫల్ మండి నుంచి హనుమాన్ టెంపుల్ వరకు రోడ్డు షో నిర్వహించారు. హైదరాబాద్ మహానగరాన్ని నిజాం సంస్కృతి నుంచి బయట వేసి కొత్తనగరంగా తయారు చేస్తామన్నారు. వారసత్వ రాజకీయాల నుంచి ప్రజాస్వామ్యం వైపు తీసుకువెళ్తామన్నారు. తెలంగాణలో, హైదరాబాద్ లో మీ కుటుంబాలు మినహా ఇంకవరూ రాజకీయాల్లో లేరా అని అమిత్ షా ప్రశ్నించారు. అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తామన్నారు.
మజ్లీస్ తోకలిస్తే మాకేం ఇబ్బంది లేదు.. కాని దాగుడుమూతలు ఎందుకు అని అమిత్ షా నిలదీశారు. ఇంట్లో కూర్చొని సీట్లు పంచుకుంటారు అని ఆయన రెండు పార్టీలను ఎండగట్టారు. హైదరాబాద్ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కేసీఆర్ ఎక్కడ ఉన్నారన్నారు. వరదలతో హైదరాబాద్ మునగడానికి కేసీఆర్ కారణమన్నారు. తాము అధికారంలోకి వస్తసే గుడ్ గవర్నెన్స్ ను అమలు చేస్తామని, అంతర్జాతీయ నగరంగా చేస్తామన్నారు. బీజేపీ దేశంలో అనేక రాష్ట్రంలో.. నగరాల్లో అధికారంలో ఉంది బీజేపీ అని, మాపై మతముద్ర వేస్తారా అని ఆయన ఖండించారు. విమర్శలు చేసిన వారే సమాధానం చెప్పాలన్నారు. ఎన్నార్సీని, కశ్మీర్ లో ఆర్టికల్ 370ని పార్లమెంట్ లో ఎందుకు అడ్డుకున్నావు అని అమిత్ షా ప్రశ్నించారు.
సీఎం కేసీఆర్ సచివాలయానికి చాలా ఏళ్ళుగా వెళ్ళలేదని, అందుకే లెక్కలు తెలియవు అని అమిత్ షా దుయ్యబట్టారు. బీజేపీ వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తుందని, ఎవరికీ భయపడకుండా దమ్ము తో పోరాడాలన్నారు. కేవలం అమ్మవారి దర్శనం కోసమే హైదరాబాద్ కు వచ్చాను అన్నారు. ఏ ఎన్నికల నూ ఈజీగా తీసుకోమని.. గల్లీ సాఫ్ చేయనందుకే టీఆర్ఎస్ కు ఇబ్బందులు వస్తున్నాయన్నారు. హైదరాబాద్ పరిస్థితి మార్చేందుకు వచ్చామని, అన్ని పథకాలు అన్ని వర్గాలకు అందుతున్నాయన్నారు. కేసీఆర్ చాలాసార్లు ఇలాంటి కార్యక్రమాలు చేసేందుకు ప్రయత్నిస్తారు.. ఎక్కడ సక్సెస్ కాలేదని అమిత్ షా చమత్కరించారు. ఆయుష్మన్ భారత్ అమలు చేయకుండా పేదలకు కార్పోరేట్ వైధ్యం దూరం చేసావని కేసీఆర్ ను విమర్శించారు. ఉస్మానియా.. గాంధీ పై భారం తగ్గించేందుకు నాలుగు ఆసుపత్రులు కడతా అన్నావ్ ఏమైనాయని ఆయన ప్రశ్నించారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ పై ఫిర్యాదు చేస్తే విచారణ చేస్తానని, ఇంత వరకు ఫిర్యాదు చేయాలని అమిత్ షా చురక అంటించారు. తన ఫోన్ ను టీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తున్నదని ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.