FbTelugu

కెసిఆర్ అహంకారాన్ని అణిచేస్తాం: తరుణ్ చుగ్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అహంకారానికి ఆత్మాభిమానానికి మద్య యుద్ధం జరుగుతోందని బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జీ తరుణ్ చుగ్ విమర్శించారు.

ఇవాళ శామీర్ పేటలోని ఈటల రాజేందర్ నివాసానికి తరుణ్ చుగ్ వెళ్లగా ఈటల పూల బోకె అందచేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తరుణ్ చుగ్ మీడియాతో మాట్లాడుతూ, అహంకారి సిఎం కెసిఆర్, ఆయన ఆవినీతికి, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఈటల రాజేందర్ టిఆర్ఎస్ పార్టీలో ఉంటూ గొంతు ఎత్తారన్నారు. ఆ గొంతును సిఎం కెసిఆర్ నొక్కేశారని, రాజ్యాహంకారంతో ఇదంతా చేస్తున్నారన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం, తెలంగాణ రాష్ర ప్రగతి కోసం గత ఇరవై సంవత్సరాలుగా ఈటల రాజేందర్ కొట్లాడుతున్నారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తరువాత టిఆర్ఎస్ ప్రభుత్వం తన విధి మర్చిపోయిందని, కాంట్రాక్టర్ల జేబులు నింపుతోందన్నారు. కెసిఆర్, ఆయన కుటుంబం కోసం తెలంగాణ వచ్చిందని, రాష్ట్ర లక్ష్యం వెనక్కు పోయిందన్నారు. ఈటల పోరాటం తెలంగాణ సమాజం కోసం పోరాటం తప్ప మరోటి కాదన్నారు. భారతీయ జనతా పార్టీ కెసిఆర్ కు వ్యతిరేకంగా ఏదైతే మాట్లాడుతుందో, అదే విషయాన్ని ఆయన పార్టీ లోపల ఉంది మాట్లాడారని అన్నారు. ఇలాంటి నాయకులను ఉండకూడదని బయటికి పంపించారని తరుణ్ ఆరోపించారు.

ఈటల శాసన సభ్యత్వానికి శనివారం నాడు రాజీనామా చేస్తున్నారు. ఆ తరువాత మాతో కలిసి వస్తున్నారని చెప్పారు. మా అందరి లక్ష్యం ఒక్కటే తెలంగాణలో తానాషా పాలనను, అతని అహంకారాన్ని అంతమొందించడమన్నారు. జన ఆందోళన కొనసాగడానికి తెలంగాణ లో ఎంత మంది వస్తే వారందర్నీ కలుపుకుని ముందుకు పోతామన్నారు. తెలగాణ వికాసమే భారతీయ జనతా పార్టీ లక్ష్యం అని ఆయన పునరుద్ఘాటించారు.  జననేత, ఉద్యమకారుడు ఈటల కు భారతీయ జనతా పార్టీ  స్వాగతం పలుకుతున్నదన్నారు. తెలంగాణ కోసం నిరంతరం పని చేసిన ఉద్యమకారుడు ఈ రోజు కెసిఆర్ ను వదిలి పెట్టి బయటికి వస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల నాటికి కెసిఆర్ అహంకారం ఓడిపోతుందని, కుటుంబపాలన ఖతం అవుతుందని తరుణ్ చుగ్ జోస్యం చెప్పారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.