FbTelugu

పాస్టర్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం: లోకేశ్

అమరావతి: పాస్టర్ పై దాడి చేయడం దారుణమని, పాస్టర్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘మంగళగిరి నియోజకవర్గం, పెనుమాక గ్రామంలో పెనుయేలు ప్రార్థనా మందిరం నిర్వాహకుడు, పాస్టర్ కిషోర్ గారి పై వైకాపా రౌడీలు దాడి చెయ్యడం బాధాకరం.

30 ఏళ్లుగా క్రీస్తు మార్గంలో నడుస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పాస్టర్ కిషోర్ గారి పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. కేసు నీరుగార్చే ప్రయత్నాలు ఆపి దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. కిషోర్ గారి న్యాయ పోరాటానికి నేను అండగా ఉంటాను.’’ అంటూ ట్వీట్ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.