FbTelugu

పోలీసుశాఖలో వీక్లీఆఫ్ అమలు చేస్తున్నాం: సుచరిత

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసుశాఖలో వీక్లీఆఫ్ ప్రకటించి అమలు చేస్తున్నామని హోంమంత్రి సుచరిత అన్నారు. రాష్ట్రంలో దిశ చట్టాన్ని తీసుకొచ్చామని తెలిపారు. అదేవిధంగా ఫోరెన్సిక్ ల్యాబ్ లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

జీరో ఎఫ్ఐఆర్ తీసుకొచ్చామన్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్నా.. 90 శాతం అమలు చేసిన ఘటన సీఎందేనన్నారు. శైలజానాథ్, కన్నా విశాఖకు వెళ్లి వచ్చారని వీళ్లకు లేని అభ్యంతరాలు చంద్రబాబుకు ఎందుకొచ్చాయని ప్రశ్నించారు. గతంలో సీబీఐ విచారణ వద్దన్న బాబు.. ప్రస్తుతం ప్రతి కేసూ సీబీఐ విచారణ కోరుతున్నారని అన్నారు.

You might also like