FbTelugu

సంపూర్ణ ఫీజు రీయింబర్స్ మెంట్ అమలు చేస్తాం: జగన్

జగనన్న విద్యాదీవెన పథకాన్ని ఇవాళ ఏపీ ముఖమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు వ్యాఖ్యలు చేశారు. ఈ పథకం కింద సంపూర్ణ పీజురీయింబర్స్ మెంట్ అమలు చేయనున్నట్టు తెలిపారు.

వచ్చే సంవత్సరం నుంచి ఫీజు రీయింబర్స్ మెంట్ ను విద్యార్థి తల్లి ఖాతాలో వేయనున్నట్టు తెలిపారు. తన తండ్రి ఎంతో ముందు చూపుతో ప్రవేశ పెట్టిన ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని తన తండ్రి మరణానంతరం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు పూర్తిగా నీరు గార్చాయని అన్నారు.

ఎంతలా అంటే ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్లను ఎలా తగ్గించాలా అనే చూశాయని అన్నారు. కాలేజీల్లో ఏదైనా సమస్యలు ఉన్నాయని భావిస్తే 1902 నంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. కరోనాతో ఇబ్బందులు ఉన్నా ఈ పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు.

You might also like