FbTelugu

మన ఊరును మనమే కాపాడుకోవాలి: చంద్రబాబు

అమరావతి : కరోనా వైరస్ రాష్ట్రంలో తీవ్రంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో మన ఊరు మనమే కాపాడుకోవాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో ప్రజలకు పలు విషయాలను వెల్లడించారు. తాను లాక్ డౌన్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తున్నానని, ప్రజలంతా కూడా పాటించాలని కోరారు.

సంక్షోభం వచ్చినప్పుడే నాయకత్వ లక్షణాలు తెలుస్తాయని తెలిపారు. కరోనా కారణంగా వలస కార్మికుల, చేతివృత్తుల వారి జీవితాలపై తీవ్ర ప్రభావం పడుతోందని అన్నారు. రైతుల పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతోందని అన్నారు. తమ వంతుగా విరాళాలు ఇచ్చామని తెలిపారు. వైసీపీ నేతలు లాక్ డౌన్ ను ఉల్లఘించి కరోనాను వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు.

You might also like