FbTelugu

పేదలను అన్నివిధాలుగా ఆదుకుంటాం : కిషన్ రెడ్డి

హైదరాబాద్: కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో పేద ప్రజలను అన్ని విధాలుగా సాయం చేసి ఆదుకుంటామని బీజేపీ కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. .కరోనా విషయంలో మార్పులు చేర్పులు చేసుకునే హక్కు రాష్ట్రాలకు ఉందని తెలిపారు. తెలంగాణ రైతులకు రూ.659 కోట్లు అందించామని తెలిపారు.

అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రైతులకు రూ.918 కోట్ల ఆర్థిక సాయం అందించినట్టు తెలిపారు. జన్ దన్ ఖాతాల్లో ఇప్పటికే నగదు జమచేసినట్టు తెలిపారు. గుజరాత్ లో చిక్కుకున్న ఏపీ మత్స్యకారులను ఆదుకుంటున్నట్టు తెలిపారు. గుజరాత్ సీఎం, అమిత్ షా లతో కూడా ఈ సమస్య పరిష్కరించమని కోరినట్టు తెలిపారు.

You might also like