FbTelugu

తెలంగాణకు నష్టం చేయం: ఏపీ మంత్రి అనిల్

నెల్లూరు: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలంగాణకి నష్టం జరిగే ఏ పనులు చేయరని నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు.

నెల్లూరు లో ఇవాళ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కృష్ణా నీటి వాడుకలో రెండు రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కొన్ని పార్టీలు కృష్ణా నీటిని వివాదం చేయాలని చూస్తున్నాయని విమర్శించారు.

ఏపీ, తెలంగాణ సీఎం లు అన్నదమ్ముల లాగా కలిసి ఎవరికి ఇబ్బంది లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టి రైతులను రెచ్చగొట్టాలని అని చూస్తే ఊరుకోమని ఆయన హెచ్చరించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.