FbTelugu

కచ్చితంగా పరీక్షలు జరిపి తీరుతాం: మంత్రి సురేష్

అమరావతి: విద్యార్థుల ఆరోగ్య భద్రత కు ఎటువంటి ఇబ్బంది లేదు అన్నప్పుడు పరీక్షలు కచ్చితంగా నిర్వహిస్తామని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు.

విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఎటువంటి భయం లేని సమయంలోనే పరీక్షలు ఉంటాయన్నారు. కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలకు మద్దతుగా కొన్ని రాజకీయ పార్టీలు పరీక్షల పై లేనిపోని రాజకీయం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ఒక తండ్రిగా అయితే నేను పరీక్షల నిర్వహణకు మద్దతిస్తానన్నారు. ఆప్షన్స్ చూడకుండా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారని, పరీక్షలు రద్దు చేయడానికి ఒక్క నిమిషం పట్టదన్నారు. టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షల పై నిన్న అధికారులతో సమావేశం అయ్యామని, ప్రస్తుతం అయితే పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేదన్నారు. ఆల్ ఇండియా పరీక్షలకు సిద్ధం అవడానికి కూడా విద్యార్థులకు సమయం ఇవ్వాల్సి ఉందన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.