FbTelugu

భూమ్మీద ఎక్కడున్నా మందులు తెస్తాం: ఈటల

హైదరాబాద్: కరోనా వైరస్ సోకిన వారికి చికిత్స అందించడానికి ఈ భూమి మీద ఎక్కడ మందులు ఉన్న తీసుకురావాలని పలుమార్లు సీఎం కేసీఆర్ ఆదేశించారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా వస్తున్న వైద్య విధానాలను తెలంగాణ ప్రజలకు అందించి వారి ప్రాణాలు ప్రాణాలను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. దీనికోసం మన వైద్యులను కూడా ఎప్పటికప్పుడు శిక్షణ ఇప్పటించుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి ఈటల  అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలో ప్రభుత్వ హాస్పిటల్స్ అందిస్తున్న వైద్యం, ట్రీట్ మెంట్ ప్రోటోకాల్ పై చర్చించేందుకు సోమవారం వెబినార్ నిర్వహించాలని నిర్ణయించామన్నారు.

ఉదయం 11 గంటల నుండి 1 గంట వరకు జరిగే వెబినార్ లో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్స్, చికిత్స అందిస్తున్న వైద్యులు పాల్గొంటున్నారని తెలిపారు. కరోనా వైరస్ పై పరిశోదన చేస్తున్న ప్రముఖ అంతర్జాతీయ వైద్యులు డాక్టర్ విజయ్ ఎల్దండి, యాశోద హాస్పిటల్ వైద్యులు డా. ఎంవీ. రావు, వైద్యులు సునీత, శంకర్, రమేష్ రెడ్డి,  గంగాధర్, కరుణాకర్ రెడ్డి, మహబూబ్ ఖాన్ పాల్గొననున్నారు.

You might also like