FbTelugu

మేము సురక్షితమే: ఇజ్రాయిల్ ఎంబసీ

న్యూఢిల్లీ: తామంతా సురక్షితంగానే ఉన్నామని, ఎలాంటి ప్రమాదం జరగలేదని ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. ఇవాళ సాయంత్రం ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం ముందు బాంబు పేలుడు జరిగిన విషయం తెలిసిందే.

పేలుడు ఘటన తరువాత సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంచుకుంటునే ఉన్నామని ఒక  ప్రకటనలో తెలిపింది. ఈ పేలుడులో మూడు వాహనాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. గణతంత్ర దినోత్సవం బీటింగ్ రిట్రీట్ కు కిలోమీటర్ దూరంలో ఈ ఘటన జరడంతో పోలీసులు ఉలిక్కి పడ్డారు. ఇప్పటికే ఆధారాల కోసం ఢిల్లీ పోలీసులు, స్పెషల్ బ్రాంచీ అధికారులు అన్వేషిస్తున్నారు. గట్టి భద్రత ఉన్న అబ్దుల్ కలాం రోడ్డులో బాంబు పేలుడు జరగడం ప్రభుత్వానికి కూడా సవాల్ గానే మారనున్నది. రక్షణ పరంగా, భద్రత పరంగా ఇజ్రాయిల్ దేశం కట్టుదిట్టంగా ఉంటుంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.