FbTelugu

విదేశీ విమాన సేవలు షురూ: కేంద్ర మంత్రి

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దిప్ సింగ్ పూరి
ఢిల్లీ: విదేశీ విమాన సర్వీసులు నడిపేందుకు మూడు దేశాల‌తో జ‌రిపిన చ‌ర్చ‌లు కొలిక్కి వ‌చ్చాయ‌ని కేంద్ర  పౌర విమాన‌యాన శాఖ మంత్రి హ‌ర్‌దీప్ సింగ్ పూరి తెలిపారు.
మొదటగా అమెరికా, ఫ్రాన్స్, జ‌ర్మ‌నీ దేశాలకు విదేశీ విమాన సేవలు ప్రారంభిస్తున్నామని ఆయన వెల్లడించారు. అమెరికా రేప‌టి నుంచి, ఫ్రాన్స్ ఎల్లుండి నుంచి భార‌త్‌కు విమాన స‌ర్వీసులు న‌డిపేందుకు అంగీక‌రించాయ‌న్నారు. జులై 18 నుంచి ఆగ‌స్టు 1 వ‌ర‌కు పారిస్ నుంచి ఢిల్లీ, ముంబై, బెంగ‌ళూరు మ‌ధ్య 28 విమానాల‌ను న‌డ‌ప‌నున్నట్లు ఎయిర్ ఫ్రాన్స్ తెలిపిందన్నారు.
రేపటి నుంచి నుంచి జూలై 31 వ‌ర‌కు భార‌త్– అమెరికా మ‌ధ్య‌ 18 యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానాల‌ను న‌డుపేందుకు ఒప్పందం కుదిరిందని కేంద్ర మంత్రి వివరించారు. జర్మ‌నీతో కూడా విమాన స‌ర్వీసుల‌పై సంప్ర‌దింపులు జ‌రిపామ‌ని, లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌తో కూడా ఒప్పందం ఓ కొలిక్కి వ‌చ్చిందన్నారు. విదేశీ విమాన స‌ర్వీసుల‌పై ఈ నిర్ణ‌యాన్ని ప‌రిస్థితుల‌కు అనుగుణంగా మార్పులు చేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి పురి తెలిపారు.

You might also like