FbTelugu

వ్యాక్సిన్ల ఉత్పత్తి పెంచుతున్నాం: భారత్ బయోటెక్

హైదరాబాద్: ప్రపంచాన్ని కరోనా సెకెండ్ వేవ్ వెంటాడుతున్న తరుణంలో వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచుతున్నట్లు భారత్ బయోటెక్ ప్రకటించింది. తమ కంపెనీలో తయారయ్యే కోవాగ్జిన్ తయారీ సామర్థ్యాన్ని పెంచనున్నట్లు తెలిపింది.

భారత ప్రభుత్వం ప్రోత్సహక నగదు మంజూరు చేయడంతో ఉత్పత్తి పెంపుదలకు మార్గం సుగమం అయ్యింది. ఏడాదికి 70 కోట్ల డోసులు ఉత్పత్తి చేయనున్నట్లు వెల్లడించింది. ఇందుకోసం అవసరమైన ముడి పదార్థాలు, ప్యాకింగ్ సమాగ్రి ఇప్పటికే సమకూర్చున్నామని పేర్కొంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.