FbTelugu

మేము పోటీలో ఉన్నాం: సీఎం కేసీఆర్

హైదరాబాద్: హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా సురభి వాణీదేవి పేరును ఖరారు చేశారు.

టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఇవాళ సాయంత్రం ఖరారు చేసి అధికారికంగా ప్రకటించారు. మాజీ ప్రధాని పివి.నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవి. సోమవారం ఆమె నామినేషన్ దాఖలు చేస్తారని తెలిపారు. గవర్నర్ కోటాలో ఆమెను నామినేట్ చేస్తారని మొన్నటి వరకు విన్నాం. అనూహ్యంగా ఆమెను గ్రాడ్యుయేట్ కోటా లో బరిలో దింపడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రతికూల పరిస్థితుల్లో హైదరాబాద్ నుంచి టీఆర్ఎస్ పోటీ చేయకుండా, వామపక్షాలు బలపర్చిన ప్రొఫెసర్ నాగేశ్వర్ కు లోపాయకారిగా టీఆర్ఎస్ మద్దతు పలికే అవకాశాలు ఉన్నాయని విన్నాం. కాని అకస్మాత్తుగా వాణీదేవి పేరును ప్రకటించడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది.

బీజేపీ నుంచి ఎమ్మెల్సీ రామచందర్ రావు, వామపక్షాల నుంచి ప్రొఫెసర్ నాగేశ్వర్, టీఆర్ఎస్ నుంచి వాణీ దేవి బరిలో ఉన్నారు. ముగ్గురు విద్యావంతులే కావడం మూలంగా పోటీ రసవత్తరవంగా ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.

You might also like

Leave A Reply

Your email address will not be published.