FbTelugu

కరోనాను సమర్థవంతంగా నిలువరిస్తున్నాం: మోదీ

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని సమర్థవంతంగా నిలువరిస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు. దేశంలో ఎన్డీఏ రెండవసారి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా ఆయన ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో పలు విషయాలను ప్రజలతో పంచుకుంన్నారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినట్టు తెలిపారు.

ఆర్టికల్ 370ని రద్దు, దేశంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు, ట్రిపుల్ తలాక్ నిశేధం, పౌరసత్వ చట్టం వంటి ఎన్నో మార్పులు తెచ్చినట్టు తెలిపారు. కరోనా భారత్ ను ఓ కుదుపు కుదిపేస్తుందని భావించిన ప్రపంచ దేశాలకు కరోనాను ఎదుర్కొని సమర్థవంతంగా నిలబడ్డామని తెలిపారు. అయితే వలస కూలీలు లాక్ డౌన్ లో తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని తెలిపారు.

You might also like