FbTelugu

నేటి నుంచి సాగర్ ఆయకట్టుకు నీరు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని సాగర్ ఆయనకట్టుకు నేటినుంచి పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేయనున్నారు. నేడు ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలంటూ.. సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

కృష్ణానదికి ఎగువన వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నాగర్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 42,378 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 10,622 క్యూసెక్కులు ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 556 అడుగుల నీటిమట్టం ఉంది.

You might also like