FbTelugu

బంకులో పెట్రోలుకు బదులు నీళ్లు

* ధర్నాకు దిగిన వినియోగదారులు

విజయవాడ: గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో పెట్రోలు బంకుల మోసాలు అధికంగా వెలుగుచూస్తున్నాయి. ఇప్పటి వరకు పెట్రోల్ కొట్టించుకునే వారికి తక్కువ పెట్రోలు వచ్చిన దాఖలాలే ఎక్కవ.. కానీ తాజాగా విజయవాడలో ఓ పెట్రోల్ బంకులో పెట్రోలుకు బదులుగా నీళ్లు వచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. వివరాల్లోకెళితే.. విజయవాడలోని అరుణశ్రీ పెట్రోలు బంకులో వినియోగదారులకు పెట్రోలుకు బదులుగా.. నీళ్లు రావడంతో వారు పెట్రోలు బంక్ ఎదుట ఆందోళన చేపట్టారు. బైకులలో పెట్రోలుకు బదులుగా నీళ్లు కొట్టడంతో పాడైపోయిన తమ బైకులకు పెట్రోలు బంక్ యాజమాన్యమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.