FbTelugu

జల వివాదాలు 70 ఏళ్లుగా ఉన్నాయి: కిషన్ రెడ్డి

హైదరాబాద్: జల వివాదాలు గత 70 ఏళ్లుగా ఉన్నాయని బీజేపీ కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలవరం మినహా ఏ ప్రాజెక్టుకూ జాతీయ హోదా ఇస్తామని కేంద్రం ప్రకటించలేదని అన్నారు. మనకంటే పేద రాష్ట్రాల్లో కూడా జాతీయ ప్రాజెక్టులు లేవని అన్నారు.

దేశంలో బీజేపీ ప్రభుత్వం అనేక సమస్యలను తీర్చిందని తెలిపారు. కశ్మీర్ చిరకాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్నట్టు తెలిపారు. లడాక్ ప్రజల కోరికను నెరవేర్చినట్టు తెలిపారు. పాక్ లో దోపిడీకి గురైన వారికి పౌరసత్వం కల్పించామని తెలిపారు.

You might also like