FbTelugu

దారుణ హత్యకు గురైన వాచ్ మెన్

పశ్చిమగోదావరి: ఓ వాచ్ మెన్ దారుణ హత్యకు గురైన ఘటన జిల్లాలోని గణపవరం మండలం, వెలగపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక వెలగపల్లిలోని ఓ రైస్ మిల్లులో వాచ్ మెన్ గా పనిచేస్తున్న సాల్మన్ రాజును నిన్న రాత్రి కొందరు గుర్తు తెలియని దుండగులు అతి దారుణంగా హత్య చేశారు.

మృతుడు ఉండి మండలం, ఆరేడు గ్రామానికి చెందిన వాడుగా గుర్తించారు. ఈ హత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.