FbTelugu

భారత్-చైనా సరిహద్దులో యుద్ధమేఘాలు

న్యూఢిల్లీ: భారత్-చైనా ఎల్ఏసీ (లైన్ ఆప్ యాచ్యువల్ కంట్రోల్/ వాస్తవాదీన రేఖ) సరిహద్దులో యుద్దమేఘాలు కమ్ముకున్నాయి. సరిహద్దులో మొన్న జరిగిన ఉద్రిక్తతలో 20 మంది భారత జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదని మోదీ ఇప్పటికే తేల్చిచెప్పేశారు. అటునుంచి చైనా కూడా తన దుందుడుకు చర్యలను ఏమాత్రం తగ్గించడం లేదు. సరిహద్దులో ఇరుదేశాలూ భారీగా సైన్యాన్ని మొహరిస్తున్నాయి. గాల్వాన్ లోయపై పట్టుకోసం చైనా గత కొంతకాలంగా తీవ్రప్రయత్నాలు చేస్తోంది. కానీ భారత్ దీనికి ఏమాత్రం అంగీకరించడం లేదు. ఈ తరుణంలో ప్రస్తుతం సరిహద్దులో యుద్ధవాతావరణం నెలకొంది.

You might also like