FbTelugu

గేట్స్ ఫౌండేషన్ కు వారెన్ గుడ్ బై

వాషింగ్టన్: మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గెట్స్, మిలిండా గేట్స్ మధ్య వివాహ బంధం పెటాకులు కావడంతో ప్రపంచంలో అత్యంత సంపన్నుడు వారెన్ బఫెట్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. మిలిండా గేట్స్ ఫౌండేషన్ నుంచి వారెన్ బఫెట్ తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.

ఇద్దరూ విడాకులు తీసుకోవడంతో ఫౌండేషన్ లో కొనసాగకూడదని నిర్ణయం తీసుకున్నాడు. మిలిండా గేట్స్ ఫౌండేషన్ నుంచి వారెన్ తప్పుకున్నప్పటికీ గేట్స్, మిలిండా కలిసి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. తన బర్క్ షైర్ హాత్ వే షేర్లను సేవా కార్యక్రమాలకు వినియోగించాలనే లక్ష్యం సగానికి పైగా పూర్తయిందని వారెన్ వెల్లడించారు. ముగ్గురు సభ్యులు ఉన్న బోర్డులో వారెన్ కూడా ఒకరు. 15 సంవత్సరాల్లో ట్రస్టు ద్వారా 27 బిలియన్ డాలర్లను సేవ కార్యక్రమాల కోసం వినియోగించాడు. ఇప్పటి వరకు ఐదు సేవా సంస్థలకు 41 బిలియన్ డాలర్లను విరాళంగా ప్రకటించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.