FbTelugu

జిన్ పింగ్ వైఖరితో యుద్దం రావచ్చు: సీసీపీ నేత కాయ్

బీజింగ్: చైనా సుప్రీం జిన్ పింగ్ మొండితనం, నియంతృత్వ పోకడల కారణంగా అమెరికా-చైనా దేశాల మధ్య యుద్ధం వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని చైనీస్ కమ్యూనిస్టు పార్టీ నేత కాయ్ సంచనల ఆరోపణలు చేశారు.

ప్రభుత్వ విధానాలను కూడా తనకు అనుకూలంగా మార్చుకున్నాడని, ఆయను నియంత్రించే అధికారం దేశంలో ఎవరికీ లేకుండా పోయిందని కాయ్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. యావత్ ప్రపంచాన్నే చైనా దేశానికి శతృవుగా మార్చిన ఘనత జిన్ పింగ్ కే దక్కుతుందని ఆయన ఆరోపించారు. ఈయన చర్యలు, ఒంటెద్దు పోకడల మూలంగా ఎన్నో దేశాలు ఆగ్రహంతో ఉన్నాయన్నారు.

దేశానికి సంబంధించిన అంతర్గత వ్యవహారాలు, అంతర్జాతీయ వ్యవహారాలు తన చెప్పు చేతుల్లో పెట్టుకున్నారని కాయ్ విమర్శించారు. ఏ నిర్ణయం తీసుకున్నా తలూపుతున్నారని, ఎవరూ ఎదురు చెప్పడం లేదన్నారు. చైనా లో ప్రజాస్వామ్యం లేదని, నియంతృత్వమే నడుస్తున్నదని అన్నారు. ప్రపంచ దేశాలది ఒక దారి అయితే, జిన్ పింగ్ ది మరో దారి అని ఆయన దెప్పి పొడిచారు.

You might also like