FbTelugu

కోవిషీల్డ్ వేసుకున్న వరుడే కావాలి: అమ్మాయి షరతు

పత్రికల్లో వచ్చే కొన్ని ప్రకటనలు నవ్వు పుట్టించడంతో పాటు చర్చకు దారితీస్తాయి. అదే కోవలోకి ఈ పెళ్లి ప్రకటన వస్తుంది. తనను పెళ్లి చేసుకోబోయే వరుడికి ఒక యువతి పెట్టిన షరతు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వరుడు లేదా వధువు కోసం సాధారణంగా కొన్ని వివరాలు ఇస్తారు. ఎత్తు, కలర్, విద్యార్హతలు, ప్రాంతం, కులం వివరాలు ఇస్తారు. కాని ఈ పెళ్లి ప్రకటనలో వింత షరతు విధించడం ప్రతి ఒక్కరిని కడుపుబ్బా నవ్విస్తున్నది. తనను పెళ్లి చేసుకునేవాడు కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకుని ఉండాలని వధువు స్పష్టం చేసింది. అది కూడా రెండు డోసులు వేసుకున వరుడే అర్హుడు అని ప్రకటించడాన్ని చూసి పలువురు పడిపడి నవ్వుతున్నారు. ఈ ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియలో తెగ వైరల్ అవుతోంది. ఈ అర్హతలు ఉన్నవారు సంప్రదించవచ్చని వాట్సప్ నెంబర్ కూడా ఇచ్చేసింది. కరోనా మహమ్మారి సమయంలో కూడా ఇలాంటి షరతులు ఉంటాయని పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.