FbTelugu

సమైక్యంగా ఉండాలని కోరుకున్నా: ఎమ్మెల్యే జగ్గారెడ్డి

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉండాలని మొదటి నుంచి కోరుకున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి తెలిపారు. రాష్ట్ర విభజన తరువాత మొదటిసారి విజయవాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వచ్చినట్లు ఆయన చెప్పారు.

విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో పీసీసీ అధ్యక్షుడు ఎస్.శైలజానాథ్ జగ్గారెడ్డికి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, సమైక్య రాష్ట్రంలో వైఎస్.రాజశేఖర రెడ్డి మూడు ప్రాంతాలను సమానంగా పాలించాడని కితాబునిచ్చారు. రాష్ట్ర విభజన తరువాత ఏపీలో తొలిసారి టీడీపీ, రెండోసారి వైసీపీ అధికారంలోకి వచ్చాయన్నారు. ప్రత్యేక తెలంగాణ ఇవ్వడం మూలంగానే ఈ రెండు పార్టీలు అధికారంలోకి వచ్చాయన్నారు. విడిపోవాలని తెలంగాణ ప్రాంతం ప్రజలు, కలిసి ఉండాలని ఏపీ ప్రాంతవాసులు కోరుకున్న మాట వాస్తవమేనని జగ్గారెడ్డి అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.