FbTelugu

ఊళ్లో ఎలుగుబంటి సంచారం..

అసీఫాబాద్: నిన్న రాత్రి ఊళ్లో ఎలుగుబంటి సంచారించి గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురైన ఘటన జిల్లాలోని కాగజ్ నగర్ లో చోటుచేసుకుంది. తరచూ ఎలుగుబంటి సంచరిస్తుండడంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు.

నిన్న రాత్రి సర్ సిల్క్ విజయా బస్తీలో ప్రవేశించిన ఎలుగుబంటి సోమవారం రాత్రి జన సంచారంలోకి ప్రవేశించిందని, ఇంకా తిరుగుతుండడంతో స్థానికులను భయాందోళనకు గురౌతున్నట్టు తెలుస్తోంది.
ఎలుగుబంటి సంచరిస్తుండడంతో ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావడంలేదు. ఎలుగుబంటిని బంధించేందుకు ఫారెస్టు అధికారుల ప్రయత్నిస్తున్నారు.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More