FbTelugu

ఇంటి గోడల్లో వందేళ్ల నాటి…

వాషింగ్టన్: పురాతన భవనాలు కొనుగోలు చేసేందుకు పలువురు ఆసక్తి కనబరుస్తారు. అక్కడ ఏమైనా విలువైన వస్తువులు, కళా ఖండాలు, నిధి నిక్షేపాలు లభ్యమవుతాయని గంపెడాశ.

కొందరు కొనుగోలు చేసిన తరువాత రహస్యంగా తవ్వకాలు కూడా జరుపుతారు. అలాంటిదే ఒకటి అమెరికాలో జరిగింది. న్యూయార్క్ కు చెందిన దంపతులు నిక్, పాట్రిక్ గత నెలలో వారు కొనుగోలు చేసిన ఇంటికి మారిపోయారు. ఈ ఇంటిని పేరొందిన స్మగ్లర నుంచి వారు కొనుగోలు చేశారు. వందేళ్ల నాటి ఇల్లు కావడంతో మరమత్తులు చేసి, అందంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఇంటి గోడలను బాగు చేసేందుకు కూలీలను నియమించి, తవ్వకాలు చేశారు. తవ్వుతున్న క్రమంలో వారికి మందు బాటిళ్లు దర్శనమివ్వడంతో ఆశ్చర్యపోయారు.

స్కాట్లాండ్ దేశానికి చెందిన ఓల్డ్ స్మగ్లర్ బాటిళ్లు కన్పించాయి. ఇంకేముంది వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 13 బాటిళ్లు లభ్యమయ్యాయి. ఇందులో 9 వినియోగించేందుకు సిద్ధంగా ఉన్నాయి. బాటిళ్లపై ఉన్న స్టిక్కర్లను పరిశీలిస్తే 1920 నాటికి చెందినవిగా కన్పించాయి. అక్టోబర్ 23, 1923 లో తయారైనట్లు ముద్ర ఉంది. ఈ ఫొటోలను నిక్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అయ్యాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.