FbTelugu

గోడకూలి.. నిద్రలోనే ముగ్గురు అనంతలోకాలకు

నాజామాబాద్: గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడి, మరో ముగ్గురు పిల్లలకు తీవ్ర గాయాలైన ఘటన నిజామాబాద్ జిల్లాలోని వర్ని మండలం, తగెలేపల్లిలో చోటుచేసుకుంది.

వివరాల్లోకెళితే.. వేసవి కావడంలో ఒరండాలో నిద్రిస్తుండగా ఒక్కసారిగా గోడ కూలింది. ఈ ఘటనలో భార్యాభర్తలు లక్ష్మీ, శ్రీను, వారి కుమారుడు కన్నా అక్కడికక్కడే మృతి చెందారు. సంజన, వైష్ణవి, పండు అనే ముగ్గురు పిల్లలకు తీవ్ర గాయాలైనాయి. వారిని బోదన్ ఆస్పత్రికి తరలించినట్టు తెలుస్తోంది.

You might also like