FbTelugu

వ్యాక్సిన్ వేసుకున్నా… మాస్క్ తప్పదు: డబ్ల్యూహెచ్ఓ

జెనివా: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మాస్క్ విషయంలో మరోసారి ప్రజలను హెచ్చరించింది. వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్నా సరే మాస్క్ ధరించాల్సిందేనని స్పష్టం చేసింది.
ఏమరుపాటుగా ఉంటే డెల్టా వేరియంట్ ముప్పు తప్పదని తేల్చింది. ప్రపంచంలోన డెల్టా వేరియంట్ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నదని అన్నారు. డబ్ల్యూహెచ్ఓ అసిస్టెంట్ డైరెటర్ మరియాంగెల సిమావో జెనివాలోని ప్రధాన కార్యాలయంలో మీడియాతో పలు అంశాలపై మాట్లాడారు. రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్నవారు తాము సురక్షితంగా ఉన్నామని భావించరాదన్నారు.

కరోనా మార్గదర్శకాలు ప్రతి ఒక్కరు పాటించాల్సిందేనని తెలిపారు. గాలి వెలుతురు బాగా ఉన్న చోట ఉండాలని ప్రజలను కోరింది. చేతులు శుభ్రంగా పెట్టుకోవాలని, భౌతిక దూరం పాటించాలని, ఎక్కువ మంది గుమిగూడిన చోటుకు వెళ్లకూడదని అన్నారు. డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ సీనియర్ సలహాదారు డాక్టర్ బ్రూస్ అయిల్వార్డ్ మాట్లాడుతూ వైరస్ రూపాంతరం చెందుతూ ప్రజలను కల్లోలపరుస్తున్నదని, డెల్టా వేరియంట్ ప్రమాదకారిగా మారిందని అన్నారు. ఇప్పటి వరకు గుర్తించిన వేరియంట్లలో డెల్టా రకం వేగంగా వ్యాప్తి చెందుతున్నదన్నారు. భారతదేశంలో డెల్టా ప్లస్ 12 రాష్ట్రాల్లో కనిపించిందని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.