FbTelugu

10 కి.మీటర్లు నడిచి జిల్లా కలెక్టర్ ను కలిసింది…

కేంద్రపార: ఒకటి కాదు రెండు కాదు సుమారు 10 కిలో మీటర్లు నడిచి వెళ్లి ఒక బాలిక జిల్లా కలెక్టర్ ను కలిసింది. ఆ పై తన తండ్రి పైనే ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ఒడిశాలోని కేంద్రపార జిల్లాలో జరిగింది.
జిల్లాలోని ఒక గ్రామంలో సుశ్రీ (6) బాలిక ఆరవ తరగతి అభ్యసిస్తున్నది. కరోనా కారణంగా మధ్యాహ్న భోజనం వడ్డించడం లేదు. ఈ డబ్బులను విద్యార్థుల ఖాతాల్లోకి నేరుగా సమ చేస్తున్నారు. బియ్యాన్ని కూడా నేరుగా ఇంటికే పంపిస్తున్నారు. డబ్బులతో పాటు ప్రతి నెలా సుశ్రీకి వస్తున్నాయి కాని అవి తనకు అందడం లేదు. వాటిని తన తండ్రి రమేష్ లాగేసుకోవడంతో విద్యార్థి సుశ్రీ ఆగ్రహానికి గురైంది. తన తల్లి చనిపోవడంతో తండ్రి రెండో వివాహం చేసుకున్నాడు.

తన బాగోగులు చూసుకోకపోగా, వచ్చేవి లాగేసుకోవడంతో జిల్లా కలెక్టర్ ను కలవాలని నిర్ణయించింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కాళ్లకు పని చెప్పింది. కాలి నడకన పది కిలోమీటర్లు నడిచి వెళ్లి జిల్లా కలెక్టర్ సమర్థ్ వర్మను కలిసింది. తన తండ్రి చేస్తున్న అన్యాయంపై బాలిక ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు పరిశీలించిన కలెక్టర్ ఆశ్చర్యానికి గురయ్యాడు. వెంటనే జిల్లా విద్యాశాఖాధికారిని పిలిపించి, బాలికకు ఇప్పటి వరకు జమచేసిన డబ్బులు, బియ్యం అందేలా చూడాలని ఆదేశించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.