FbTelugu

మూడు నెలల బకాయిలను మాఫీ చేయాలి: రాజాసింగ్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మూడు నెలల విద్యుత్ బకాయిలను ప్రభుత్వం వెంటనే మాఫీ చేయాలని బీజేపీ ఎమ్మె్ల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

కరెంటు బిల్లులను తగ్గించాలని తాము శాంతి యుతంగా ధర్నాకు పిలుపునిస్తే హౌస్ అరెస్టులు చేయడం దారుణమన్నారు. అధిక విద్యుత్ చార్జీలతో పేదలు తీవ్ర ఆందోళనకు గురౌతున్నారని అన్నారు. విద్యుత్ చార్జీలపై ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.

You might also like