FbTelugu

రూ.3 కోట్లు లంచం అడిగాడు: క్వారీ యజమాని

విశాఖపట్నం: విజయనగరం గనుల శాఖ ప్రాంతీయ విజిలెన్స్‌ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ ప్రతాప్ రెడ్డిపై వీవీఆర్‌ అసోసియేట్‌ యజమాని పీ.శ్రీనివాస్‌ తీవ్ర ఆరోపణలు చేశారు.

విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ సంస్థ గత 40 సంవత్సరాలుగా క్వారీయింగ్‌ చేస్తోందని శ్రీనివాస్ అన్నారు. అనకాపల్లి మండలం వెంకుపాలెంలోని తమ క్వారీలో అక్రమాలు గుర్తించామని, రూ.100 కోట్ల జరిమానా విధించకుండా ఉండాలంటే రూ.3 కోట్లు లంచంగా ఇవ్వాలని ప్రతాప్ రెడ్డి డిమాండ్‌ చేశారని ఆయన ఆరోపించారు. అందుకు తను నిరాకరించడం వల్లే తమ కంపెనీకి రూ.33 కోట్ల జరిమానా విధించారని ఆయన అన్నారు.

రెండు నెలల క్రితం ప్రతాప్ రెడ్డి తనకు ఫోన్‌చేసి క్వారీ యజమానుల నుంచి కొన్ని ‘ఫార్మాలిటీస్‌’ కోరారని అన్నారు. ఈ విషయాన్ని అప్పుడే తమ అసోసియేషన్‌ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని శ్రీనివాస్ చెప్పారు. అసోసియేషన్ నాయకులు ఫార్మాలిటీస్ ను పూర్తి చేసేందుకు నిరాకరించారన్నారు. దీంతో కక్ష పెట్టుకున్న ఆయన నాలుగు రోజుల క్రితం రోలుగుంటలో అసోసియేషన్ అధ్యక్షుడికి చెందిన క్వారీపై దాడులు నిర్వహించారన్నారు. అక్రమాలు జరిగాయంటూ ప్రతాప్ రెడ్డి భారీ మొత్తంలో జరిమానా విధించారని శ్రీనివాస్ ఆరోపించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.