FbTelugu

బెంగాల్, అస్సాంలో మొదలైన పోలింగ్

కొలకతా: పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలలో పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరారు. ఎండకాలం కావడంతో త్వరగా ఓటు వేసేందుకు వచ్చారు.

తొలి దశలో భాగంగా ఇవాళ అస్సాంలో 47, బెంగాల్ లో 30 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. అస్సాంలో మొత్తం 126 నియోజకవర్గాలు ఉండగా మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. 47 స్థానాలకు తొలివిడత ఓటింగ్ జరుగుతుండగా… అస్సాం సిఎం సోనోవాల్ మజులీ స్థానం నుంచి బరిలో ఉన్నారు. అసెంబ్లీ స్పీకర్ హితేంద్రనాథ్ గోస్వామి జోరాట్ నుంచి, పిసిసి అధ్యక్షుడు రిపున్బోరా గోపూర్ నియోజకవర్గం నుంచి పోటీలో చేస్తున్నారు.

బెంగాల్ లో 8 విడతల సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియలో భాగంగా తొలి దశలో 30 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. ఈ విడతలో.. మొత్తం 191 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. మావోయిస్ట్‌ ప్రభావ ప్రాంతం జంగల్‌మహల్‌ కిందకు వచ్చే జిల్లాలు  పురులియా(9), బంకురా(4), ఝార్ర్గామ్‌(4), పశ్చిమ మిడ్నపూర్‌(6), తూర్పు మిడ్నపూర్‌(7) జిల్లాల్లోని గిరిజన ప్రాంతాల్లోనే జరుగుతున్నాయి. ఇక్కడ నువ్వా నేనా అన్నరీతిలో బీజేపీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ తలపడుతున్నాయి. పురులియాలో 185, ఝార్ర్గామ్‌లో 144 కంపెనీల కేంద్ర బలగాలను మొహరించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.