FbTelugu

5 రాష్ట్రాల్లో మొదలైన ఓటింగ్

న్యూఢిల్లీ: దేశంలోని 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఓటింగ్ ప్రారంభమైంది. పలు కేంద్రాలలో ఈవిఎం లు మొరాయించాయి. ఈవిఎం లు మొరాయించడంతో కొన్ని చోట్ల ఆలస్యంగా ఓటింగ్ ప్రారంభమైంది.
పశ్చిమ బెంగాల్ హౌరాలో టిఎంసి నాయకుడి ఇంట్లో ఈవిఎం లభ్యం కావడంతో బిజెపి నేతలు కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఇవాళ పశ్చిమ బెంగాల్ లో మూడో దశ ఎన్నికలు జరుగుతున్నాయి. అస్సాంలో మూడో దశ జరుగుతుండగా, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో మాత్రం అన్ని స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.

జయలలిత నెచ్చెలి శశికళ ఓటు గల్లంతు…
మాజీ ముఖ్యమంత్రి కుమారి జె.జయలలిత నెచ్చెలి వికె.శశికళ ఓటు గల్లంతు అయ్యింది. చెన్నై పోయెస్ గార్డెన్ వేద నిలయంలో జయలలిత తో పాటు వికె.శశికళ 30 ఏళ్ల నుంచి ఉంటున్నారు. వేద నిలయాన్ని స్మారక మందిరంగా మార్చడంతో శశికళ పేరును ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. చెన్నై తేనాంపేటలో డిఎంకె అధినేత ఎం.కె.స్టాలిన్, ఆయన భార్య, కుమారుడు ఉదయనిధి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు కమల్ హాసన్, ఆయన కుమార్తెలు శృతిహాసన్, అక్షర హాసన్ చెన్నైలో ఓటు వేశారు. దాదా సాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత రజినీకాంత్, సినీ నటుడు సూర్య, ఆయన తమ్ముడు నటుడు కార్తీ కూడా పోలింగ్ కేంద్రంలో నిల్చుని ఓటేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.