FbTelugu

ఎమ్మెల్సీ కవితకు షాకిచ్చిన ఓటర్లు

హైదరాబాద్: సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కు గ్రేటర్ హైదరాబాద్ ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు. కవిత ఇన్ ఛార్జీగా ఉన్న గాంధీ నగర్ డివిజన్ లో టీఆర్ఎస్ అభ్యర్థి ఘోర పరాజయం పాలైంది.

ముషీరాబాద్ నియోజకవర్గంలోని గాంధీ నగర్ డివిజన్ నుంచి స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ మరదలు ముఠా పద్మా నిల్చున్నది. ఆమె బీజేపీ అభ్యర్థి పావని చేతిలో ఓటమి పాలు కావడం టీఆర్ఎస్ నేతలను కంగుతినిపించింది. అదే విధంగా పర్యాటక శాఖ మంత్రి ఇన్ ఛార్జీ గా ఉన్న అడిక్ మెట్ డివిజన్ లో, విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి ఇన్ ఛార్జీగా ఉన్న ఆర్.కె.పురంలో టీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోయారు. త్వరలోనే కవిత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుందున్న ప్రచారం జరుగుతున్న తరుణంలో ఆమె ఇన్ ఛార్జీగా ఉన్న డివిజన్ లో ఓటమి కావడం చర్చనీయాంశంగా మారనున్నది.

పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ ఇన్ చార్జ్ గా ఉన్న ముషీరాబాద్ లోని 3 డివిజన్లలో, విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్వర్ రెడ్డి ఇన్ చార్జ్ గా ఉన్న సరూర్ నగర్ డివిజన్ లో టీఆర్ఎస్ అభ్యర్థులు పరాజయం పాలయ్యారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.