FbTelugu

వాలంటీర్ దాడి… మహిళ మృతి

కృష్ణా: మచిలీపట్నం మండలం బొర్రాపోతుపాలెంలో మద్యం సేవించవద్దని వారించిన మహిళపై దాడి చేయడంతో స్పృహ కోల్పోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.

పోలీసుల కథనం ప్రకారం ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. బొర్రాపోతుపాలెంలోని చర్చి వద్ద యువకులు మద్యం సేవిస్తుండగా.. ఇక్కడ తాగకూడదంటూ ధనలక్ష్మి(47) అనే మహిళ వారించింది. తమనే వారిస్తావా అంటూ మద్యం సేవిస్తున్న యువకులు ఆమెతో ఘర్షణకు దిగారు. యువకుల్లో ఒక్కరు వాలంటర్ కూడా ఉన్నారు. దెబ్బలు గట్టిగా తగలడంతో ఆమె స్పృహ కోల్పోయింది. పరిస్థితి విషమించడంతో స్థానికులు మచిలీపట్నం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే మృతిచెందింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.